Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మంలోని ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2020-21 వార్షిక విద్యా సంవత్సరానికి వివిధ పీజీ కోర్సుల్లో ఈనెల 16వ తేదీన కళాశాలలో ఉదయం 10 గంటలకు అడ్మిషన్లు ప్రక్రియ ఉంటుందని కళాశాల ప్రిన్సిపల్ ఎస్. ఎస్ రత్న ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎమ్మెస్సీ 1, జువాలజీ 3 ,ఎం కాం 2 ఎకనామిక్స్ 7 , పొలిటికల్ సైన్స్ 5 ,తెలుగు 2 సీట్లు ఉన్నాయని తెలిపారు . విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మూడు సెట్లు జిరాక్స్ పి జి ర్యాంక్ కార్డుతో హాజరుకావాలని తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ సౌకర్యం ఉండదని పేర్కొన్నారు.