Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూసుమంచి
మండలంలోని చేగొమ్మ గ్రామంలో గత సోమవారం కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న పంటలను గురువారం మండల వ్యవసాయ శాఖ అధికారి ఆర్.వాణి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చేగోమ్మ చైర్మన్ ఇంటూరి శేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రెడ్డిమళ్ళ లక్ష్మయ్య, మొక్కజొన్న పంటను సందర్శించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మల్లిడి వెంకన్న, ఆసిఫ్ పాష, బానోత్ శ్రీను, కొక్కిరేని సీతారాములు, రెడ్డి మళ్ళ వెంకన్న, రెడ్డమళ్ళ లక్ష్మయ్య, ఏఈఓ సౌమ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.