Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్లూరు
కార్బైడ్ రహిత మామిడి పండ్లను డోర్ డెలివరీ ద్వారా అమ్మకాలను గురువారం జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమశాఖ అధికారి అనసూర్య ప్రారంభించారు. మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో కోడిశాని వెంకటేశ్వరరావు అనే రైతు తన మామిడితోటలో కార్బైడ్ రహిత మామిడి పండ్లను అమ్మేందుకు సిద్ధంగా ఉండటంతో ప్రారంభిం చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కార్బైడ్ రహిత మామిడి పండ్లను తినడం ద్వారా క్యాన్సర్, నరాలు, జీర్ణకోశ, సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. సహజ సిద్ధంగా మాగించిన పండ్లను తింటే ఆరోగ్య పరంగా మంచిదన్నారు. మామిడి పండ్లు కావాల్సిన వారు ఫోన్ నెంబరు 9390515159 ద్వారా సంప్రదించగలరని కోరారు. కార్యక్రమంలో సహాయ సంచాలకులు కె.అనిత, టెక్నికల్ ఉద్యాన శాఖాధికారి గుడిమెట్ల సందీప్ కుమార్, సత్తుపల్లి ఉద్యాన శాఖాధికారి కె.మీనాక్షి, రైతులు పాల్గొన్నారు.