Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైరా మునిసిపాలిటీలో తీవ్ర సమస్యగా మారిన కోతుల బెడద నివారణకు పాలకవర్గం రంగంలో దిగింది. గురువారం ఉదయం నుండి వైరాలో కోతులను బంధించటం ప్రారంభించారు. నెల్లూరు నుండి వచ్చిన ఒక బృందం వైరాలో పలు చోట్ల బోన్లు పెట్టి కోతులను పడుతున్నారు. మరో బృందం రెండు రోజుల్లో వైరాకు వచ్చి కోతుల వేటలో పాల్గొంటారని వేటగాళ్లు తెలిపారు. ఒక్కో కోతికి రూ.350 చొప్పున మాట్లాడుకుని వేట ప్రారంభించారు. వైరా మునిసిపాలిటీ పరిధిలో వైరా పట్టణంతోపాటు, సోమవరం, గండగలపాడు, బ్రాహ్మణ పల్లి, పల్లిపాడు, దుద్దేపుడి, లాలాపురం గ్రామాలలో కూడా కోతులను బంధించాల్సి ఉన్నది. బంధించిన కోతులను మున్సిపల్ అధికారులే అటవీ శాఖ పర్మిషన్ తో ఏ ప్రాంతంలో వదిలి వేయాలో నిర్ణయించాల్సి ఉంటుంది. మొత్తం మునిసిపాలిటీలో సుమారు 5 వేల వరకు కోతులు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో కోతుల వేట కు రూ.4 లక్షలు కేటాయించారు. ఇవి సరిపోవని కనీసం 10 లక్షలయినా కేటాయించి కోతుల బెడద తొలగించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఏమైనా పాలకవర్గం, అధికారులు కోతుల వేట ప్రారంభించటాన్ని అభినందిస్తున్నారు. కాగా మున్సిపల్ బడ్జెట్ చాలదనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తుంది.