Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కామేపల్లి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ ఇన్చార్జి రాంరెడ్డి చరణ్‌రెడ్డి అన్నారు. రాంరెడ్డి చరణ్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని సొంత గ్రామమైన పాత లింగాలకు వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కొత్తలింగాల కోటమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. మా తాతల ముత్తాతల నుండి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నామని, తుది శ్వాస వరకూ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, రాంరెడ్డి కృష్ణారెడ్డి, జడ్పిటిసి వెంకట ప్రవీణ్ కుమార్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు రాయల రామకృష్ణ, భావుసింగ్ ముక్తి భాస్కర్ రావు, మాళోత్ ప్రేమ్, ఆళోతు శివ, భట్టు నాను, ధమ్మలపాటి సత్యం, రడబోతు గోపిరెడ్డి, రమేష్‌రెడ్డి, ఆవుల వెంకన్న, కొర్ర రాములు తదితరులు పాల్గొన్నారు.