Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చింతలచెరువు కోటేశ్వరరావు
నవతెలంగాణ-బోనకల్
మండలంలో రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిందన్నారు. వానాకాలం పంటలో పత్తి పంటలు సాగు చేసిన అన్నదాతలు అందరు అకాల తుఫాన్ల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. పత్తి పంట సాగు చేసిన అన్నదాతలు అందరూ పత్తిపంటను తొలగించి మండలంలో యాసంగి పంటగా సుమారు 11 ,981 ఎకరాలలో మొక్కజొన్న పంటను సాగు చేశారన్నారు. ప్రస్తుతం మొక్కజొన్న పంట రైతులకు ఆశాజనకంగా ఉందన్నారు. మండలంలో సుమారు మూడు లక్షల యాభై తొమ్మిది క్వింటాళ్ల దిగుబడి వస్తుందన్నారు ప్రభుత్వం వేసే కాంటాలు ప్రకారం ఏడు లక్షల బస్తాలు దిగుబడి వస్తుందన్నారు. సాగుచేసిన మొక్కజొన్న పంట బోనకల్ మండలంలో అత్యధికంగా ఉందని, ప్రభుత్వం గతంలో మొక్కజొన్న పంటను కొనుగోలు చేయబోమని ప్రకటించడంతో ప్రైవేటు వ్యాపారులు గ్రామాలలో తిరుగుతున్నారని, ప్రైవేటు వ్యాపారులు పంటకు గిట్టుబాటు ధర చెల్లించే పరిస్థితి కనిపించడం లేదన్నారు. దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది అన్నదాత లు ప్రభుత్వం చెప్పిన విధంగా పంటల సాగు చేసి తీవ్రంగా నష్టపోయారన్నారు. ఆయన వెంట ఎంపీపీ కంకణాల సౌభాగ్యం సిపిఎం మండల కమిటీ సభ్యుడు గుగులోతు నరేష్ తదితరులు పాల్గొన్నారు.