Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరా
వైరా మండలం తాటిపూడి గ్రామానికి చెందిన అంధ కళాకారిణి శ్రీ రంగం శేషుకుమారి, కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన అంధ కళాకారుడు గుత్తా క్రాంతికుమార్ ఒకరినొకరు ఇష్టపడి గురువారం వధువు స్వగ్రామం తాటిపూడి గ్రామంలో వేదమంత్రాల మధ్య పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే శేశుకుమారి అంధురాలు. తల్లి దండ్రులు వెంకటరమణ,అనురాధ లు నిరుపేదలు.అయినప్పటికీ సాధ్యమైన వరకు చదువు చెప్పించారు. శేషుకుమారి గాయనిగా చిన్నతనం నుండి పలువురి ప్రశంసలు అందుకుంది.కొన్ని సంవత్సరాల క్రితం తండ్రి చనిపోవటం తో తల్లి కూతురు కు అన్నీ తానై చూసుకుంటూ ప్రోత్సహించింది. కళా ప్రదర్శనలు ఎక్కడ నిర్వహించినా శేషుకుమారీని తీసుకుని వెళుతూ ఉండేది.అదే బందం లో వాయిద్య కళాకారుడైన క్రాంతి కుమార్ లు ఒకరి నొకరు ఇష్టపడ్డారు.అయితే ఈ వివాహానికి క్రాంతికుమార్ తల్లి దండ్రులు అంగీక రించక పోవటం తో కొంత జాప్యం జరిగింది.విషయం తెలుసుకున్న తాటిపూడి ఎంపీటీసీ సభ్యులు అల్లిక కాటంరాజు కంచిక చర్ల వెళ్లి క్రాంతి కుమార్ తల్లి దండ్రులను ఒప్పించి గురువారం పెండ్లి జరిపించడం తో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.