Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జూలూరుపాడు
ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ మండల పరిధిలో కనీసం పబ్లిక్ టాయిలెట్స్ కట్టించడంలో అధికారులు విఫలమౌతున్నారని బీఎస్పీ మండల అధ్యక్షులు తాంబర్ల నర్సింహారావు అన్నారు. గురువారం ఈ విషయమై ఎండీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇరవై నాలుగు పంచాయతీలు ఇంకా ఎన్నో చిన్న గ్రామాల ప్రజలు బ్యాంక్ కోసం, ఏటీఎం కోసం తహశీల్దార్ కార్యాలయంకు, ఎంపీడీఓ, ఎండీఓ, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వారి అవసరం కోసం, పోలీస్ స్టేషన్కు జూలూరుపాడ్ వస్తున్నారన్నారు. కానీ ఇక్కడ ఎలాంటి పబ్లిక్ టాయిలెట్స్ లేక వృద్ధులు, మహిళలు అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని గుర్తించి ప్రభుత్వ టాయిలెట్స్ ఏర్పాటు చేయాల్సిందిగా వారు కోరారు.