Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10శాతం రిజర్వేషన్లే లక్ష్యం
- జీవో నెం.3 అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే
- విలేకర్ల సమావేశంలో గిరిజన సమాఖ్య జిల్లా నేతలు
నవతెంలగాణ-కొత్తగూడెం
ఏజెన్సీలో నిరుపేద గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు, 10శాతం రిజర్వేషన్ అమలు, గిరిజన చట్టాల అమలే లక్ష్యంగా ఉద్యమిస్తామని తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా నేతలు పేర్కొన్నారు. గురువారం శేషగిరిభవన్లో జరిగిన టీజీఎస్ జిల్లా నూతన కౌన్సిల్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాష్ట్ర నాయకులు కల్లూరి వెంకటేశ్వర్లు, జిల్లా కార్యనిర్వహక అధ్యక్షులు బానోతు వెంకట్, అధ్యక్ష, కార్యదర్శులు పాయం శ్రీను, భూక్య శ్రీనివాస్ మాట్లాడారు. ఏజెన్సీలో 100 శాతం గిరిజనులకు నియామకాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో అమలుచేయాల్సిన భాద్యత ప్రభుత్వానిదేనన్నారు.
తెలంగాణ గిరిజన సమాఖ్య జిల్లా నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ గిరిజన సమాఖ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీ గురువారం ఎన్నుకున్నారు. టీజీఎస్ రాష్ట్ర నాయకులు జిల్లా ఇన్చార్జ్ కల్లూరి వెంకటేశ్వర్లు నూతన కమిటీని ప్రకటించారు. జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులుగా బానోతు వెంకట్ (జిల్లా కేంద్రం), జిల్లా అధ్యక్షులుగా పాయం శ్రీను (మణు గూరు), ఉపాధ్యక్షులుగా బానోతు గోవిందు (చుంచు పల్లి), భూక్య దస్రు (సుజాతనగర్), కల్లూరి శ్రీరాము లు (భద్రాచలం), పి.రామారావు (చర్ల), పొడియం ఆదిలక్ష్మి (భద్రాచలం), బాడిష సతీష్ (మణుగూరు), గుగులోత్ కృష్ణ (ఇల్లందు), జిల్లా ప్రధాన కార్యదర్శిగా భూక్య శ్రీనివాస్ (జిల్లా కేంద్రం), సహాయ కార్యదర్శు లుగా గుగులోత్ బాబూరావు (చుంచుపలి)్ల, పాలెం సత్యనారాయణ (దుమ్ముగూడెం), నూనావత్ గోవిందు (లక్ష్మి దేవిపల్లి), గుగులోత్ రాంచందర్ (టేకులపల్లి), మెస్సు శ్రీను (ఆళ్ళపల్లి), వూకె నారాయణ (అన్నపురెడ్డి పల్లి), కాక మహేష్ (చండ్రుగొండ), కీసర గంగరాజు (మణుగూరు), ఆర్గనైజింగ్ కార్యదర్శిగా వర్స గౌరయ్య (భద్రాచలం), కోశాధికారిగా భూక్య కేవుల్యా (జూలూరుపాడు) వీరితో పాటు మరో 17 మందికి జిల్లా కౌన్సిల్ సభ్యులుగా ఎన్నుకున్నారు.