Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సభకు పోవద్దంటూ ఆదేశాలు
నవతెలంగాణ-కారేపల్లి
ఖమ్మంలో షర్మిల ఏర్పాటు చేస్తున్న సంకల్ప సభ కారేపల్లి మండలంలోని టీఆర్ఎస్లో సెగ పుట్టిస్తుంది. షర్మిల నూతన పార్టీ ఏర్పాటు సన్నాహకంలో భాగంగా సంకల్ప సభ నిర్వహిస్తున్న విషయం విధితమే. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అభిమానులు పలు పార్టీల్లో ఉండటంతో వారు షర్మిల సభను విజయవంతం చేయటానికి నడుంకట్టారు. దానిలో భాగంగా ఇటీవల సీతారామ హౌటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వాల్‌పోస్టర్లను విడుదల కూడా చేశారు. ఈ కార్యక్రమంలో అధికంగా టీఆర్ఎస్కు చెందిన నాయకులు హాజరు కావటంపై ఆ పార్టీలో ప్రకంపనలు మొదలైనాయి. ఈ షర్మిల సభ జయప్రదానికి కారేపల్లి, గేటుకారేపల్లి, పేరుపల్లి, కారేపల్లి క్రాస్‌రోడ్, ఉసిరికాయలపల్లి, చీమలపాడుకి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు కృషి చేయటంపై వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ దృష్టికి రావటంతో ఎమ్మెల్యే ఒకింత అగ్రహంగానే ఉన్నారని వినికిడి. కారేపల్లి మండలంలో టీఆర్ఎస్ ఇప్పటికే ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే రెండు గ్రూపులతో ఎవరికి వారు కార్యక్రమాలు ఉండగా షర్మిల సంకల్పసభ టీఆర్ఎస్కు మరో తలవనొప్పిగా తయారైంది. ఇప్పటికే షర్మిల సంకల్ప సభకు టీఆర్ఎస్ శ్రేణులు పోవద్దంటూ ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తుంది. ఆ ఆదేశాలు ఏ మేరకు పనిచేస్తాయో వేచిచూడాలి.