Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం నగరంలోని స్థానిక శ్రీశ్రీ సర్కిల్ ప్రాంతంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంఛార్జి తాళ్ళూరి రామ్ గురువారం ప్రారంభించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కి రెండు కళ్ళు వంటివని, రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం ఆయన పోరాడుతున్నారన్నారని అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే క్రమంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ఖమ్మం నగరంలో ప్రారంభించినట్లు తెలిపారు. ప్రశ్నించేతత్వంతో పార్టీ ఏర్పడిందన్నారు. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలలోనూ జనసేన పార్టీ పోటీ చేస్తుందని, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలే తమ బలమన్నారు. త్వరలో జరగనున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రతి డివిజన్ నుంచి పోటీ చేస్తామన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి తొలుత నగరంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అర్యామ్ ఖాన్, తెలంగాణ ఇంఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి వి.వి.రామారావు, జిహెచ్ఎంసి ప్రెసిడెంట్ రాధారామ్ రాజలింగం, సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యదర్శి దుంపట శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ ఇంఛార్జి ఆకుల సుమన్, యువజన విభాగం అధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్, విద్యారథి విభాగం అధ్యక్షులు సంపత్ నాయక్ , ఖమ్మం నగర కమిటీ అధ్యక్షులు మిరియాల జగన్, ఖమ్మం నగర సమన్వయకర్త ఎండి.సాధిక్ అలీ, ఖమ్మం నగర ప్రధాన కార్యదర్శి సురభి సూరజ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.