Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొత్తగూడెం : అపోహలు వీడి ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవాలని కలెక్టర్ ఎంవి.రెడ్డి జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాధి సెకండ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఈ తరుణంలో వ్యాధి నియంత్రణ జరగాలంటే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టీకా వేస్తున్నట్టు తెలిపారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తదుపరి వ్యాధి సంక్రమించడానికి పటిష్ట నియంత్రణ ఉంటుందని వైద్యులు చేసిన అధ్యయనాలు తెలియచేస్తున్నాయని చెప్పారు. కరోనా మహామ్మారి నుండి రక్షణ పొందడానికి మన చేతిలో ఉన్న ఏకైక ఆయుధం టీకా తీసుకోవడమేనని ఉద్ఘాటించారు. అన్ని మండలాల ప్రత్యేక అధికారులు కోవిడ్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియను పర్యవేక్షణ చేయాలని చెప్పారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం నిర్ధారణ జరిగితే ఐసోలేషన్ చికిత్సకిట్లు పంపిణీ చేసి ప్రతి రోజు ఆరోగ్య పరిస్థితులను పర్యవేక్షణ చేయాలని చెప్పారు.