Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీ
నవతెలంగాణ-అశ్వారావుపేట
మండల పరిధిలోని అచ్యుతాపురంకు చెందిన కొత్తపల్లి సత్యనారాయణ వ్యవసాయ క్షేత్రంలో గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను బుధవారం రాత్రి దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే పొలానికి వెళ్ళిన రైతు ట్రాన్స్ఫార్మర్ను చూసి అవాక్కయ్యాడు. వెంటనే ఎన్పీడీసీఎల్ ఏఈ ప్రభాకర్‌కు సమా చారం ఇవ్వగా లైన్ మేన్ శివను విచారించాల్సిందిగా ఆదేశించారు. లైన్ మేన్ సంఘటనా స్థలానికి వెళ్ళి సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా ఏఈ ప్రభాకర్ మాట్లాడుతూ అనుమానితులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, ప్రభుత్వం ఖర్చుతో తిరిగి రైతుకు ట్రాన్స్ఫార్మర్ అందజేస్తామని తెలిపారు.