Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ ఆఖరు నాటికి పనులు పూర్తి చేయాలి
- విద్యుత్ శాఖ అధికారులతో పీవో సమీక్ష
నవతెలంగాణ-భద్రాచలం
ఉమ్మడి జిల్లా ఫారెస్టు, విద్యుత్ శాఖ అధికారులతో ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు గురువారం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. త్రీ ఫేస్ కనెక్షన్ లైన్లు, సింగిల్ ఫేస్ కనెక్షన్ లైన్ల పనుల నిర్వహణ ఎంత వరకు వచ్చిందని విద్యుత్ శాఖ ఏఈలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అటవీశాఖ నుంచి వచ్చిన అనుమతుల మేరకే విద్యుత్ పనులు చేయించాలని విద్యుత్ శాఖ అధికారులను పీవో ఆదేశించారు. వచ్చే జూన్ ఆఖరు నాటికి పనులు పూర్తి చేయాలని విద్యుత్ శాఖ ఎస్ఈ సురేందర్‌ను పీవో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల ఫారెస్టు అధికారులు, విద్యుత్ శాఖ ఏడీఈ ఆనురాధ, ఆర్ఓఎఫ్ఆర్ శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా విద్యుత్ శాఖ ఏఈలు పాల్గొన్నారు.