Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వసభ్య సమావేశంలో విప్ రేగా
నవతెలంగాణ-పినపాక
మండలంలో ప్రజలు ముఖ్యంగా ఎదుర్కొంటున్న భూ సమస్యలను, పోడు భూమి సమస్యలను, మిషన్ భగీరథ తాగునీటి సమస్యను 100శాతం తీర్చేలా చేస్తానని హామీ ఇస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ ఆధ్వర్యంలో మండల సర్వ సభ్య సమావేశంకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ పనులు సక్రమంగా కానందున ప్రజలు నీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని, వారిని ఇబ్బంది పెట్టడం సరికాదని అధికారులతో అన్నారు. ఒక వైపు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భయంతో ఉన్న వారికి కనీస సౌకర్యాలు కలిగించాలని, ప్రభుత్వం వైద్యులు, పంచాయతీ సిబ్బంది, కార్యదర్శులు, సర్పంచులు, బాధ్యతాయుతంగా కరోనాపై అవగా హన కల్పించాలన్నారు. మండలంలో ఎక్కడ నీటి కోసం ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను కోరారు. ఉపాధి హామీ పనులు చేసేటప్పడు కూడా కూలీలు మాస్కులు ధరించేలా చూడాలన్నారు. ఫారె స్ట్ అధికారులు పోడు భూముల విషయంలో జోక్యం చేసుకోవద్దని ట్రెంచ్ పనులను ఆపాలని ఆయన అన్నారు. వేసవి కాలం కావున విద్యుత్ అధికారులు విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేయాల న్నారు. ముఖ్యమంత్రి ప్రతి మండలంలో భూమిని సర్వే చేయించి పట్టాలు ఇవ్వడం జరుగుతు ందన్నారు. ప్రజలు ఎవరూ అధైర్యపడవద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తమ తమ అభివృద్ధి నివేదికలను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసులు, తహసీల్దార్ విక్రమ్ కుమార్, ఎంపీవో శబనా, స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ సెక్రటరీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.