Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
మండలంలోని మారుమూల ప్రాంతమైన పూసుకుంట గ్రామంలో నివసిస్తున్న కొండరెడ్ల జీవన స్థితిగతులు, కుటుంబం నేపథ్యం, వారి వ్యక్తిగత అవసరాలు గురించి వివరాలు సేకరించడం కోసం గురువారం అధికారులను సన్నద్దం చేయడానికి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ పుదుచ్చేరి నుండి దమ్మపేటలోని అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్‌లో మాట్లాడారు. ఈ సర్వే వలన అక్కడి ప్రజల వ్యక్తిగత పోషణ వివరాలు కూడా తెలుస్తాయని, ఆ గ్రామంలో ఇతరత్రా అవసరమైన నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించాలని సూచించారు. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలు వారికి చేరుతున్నాయా లేవా అని అధికారులనుండి ఆరా తీసారు. వీడియో కాన్పెరెన్స్‌లో సర్పంచ్, ఆశావర్కర్లు, అధికారులతో మాట్లాడారు. గ్రామంలో ఆరోగ్య సదస్సులు నిర్వహించడం, హైజీన్ కిట్ల పంపీణీ చేయడం, ఆరోగ్య సేవలందించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐఆర్సీయస్ భద్రాద్రి కొత్తగూడెం జె.భవాని శంకర్ రాజ్‌భవన్ జాయింట్ సెక్రటరీ, వైద్యాధికారులను అభినందించారు. అనంతరం గవర్నర్ జాయింట్ సెక్రటరీ భవాని శంకర్ అశ్వారావుపేట మండలంలోని ఎన్నుకొనబడిన కొండరెడ్ల నివాస ప్రాంతమైన గోగులపూడి గ్రామంలో ఈ సర్వే నిర్వహించుటకు అశ్వారావుపేట తహశీల్దారు కార్యాలయాన్ని సందర్శించి మండలాదికారులకు అవగాహన కల్పించనున్నారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వర్లు, పూసుకుంట సర్పంచ్ ఉమ్మిళ్ళ దుర్గ, అంగన్వాడీ కార్యకర్త సుజాత, పూసుకుంట గ్రామ పెద్ద రాజిరెడ్డి, ఇతర మండలాధికారులు పాల్గొన్నారు.