Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు ఆహ్వాన పత్రిక అందజేత
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 21న శ్రీరామ నవమిని పురస్కరించుకుని జరగనున్న శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవానికి తరలి రావాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు రామయ్య కల్యాణ ఆహ్వాన పత్రికను అందజేశారు. గురువారం సాయంత్రం ఈ మేరకు హైదరాబాదులో సీఎం కేసీఆర్ను కలిసి దేవస్థానం ఈవో బి.శివాజీ ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు ,దేవస్థానం అధికారులు ఈ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కల్యాణ మహౌత్సవానికి సీఎం కేసీఆర్ దంపతులను రావాల్సిందిగా వేదపండితులు ఆశీర్వచనం పలికారు. ఈ సందర్భంగా భద్రాచల రామయ్య ప్రసాదాలను అందజేశారు. సీఎం కేసీఆర్ను దేవస్థానం అధికారులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మహబూబాద్ ఎంపీ మాలోతు కవితకు రామయ్య కల్యాణ పత్రికను అందజేశారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వానం
భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ మహౌత్సవానికి రమ్మని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని దేవస్థానం ఈఓ బి.శివాజీ ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఆహ్వానించారు. ఆలయ అధికారులు, వేదపండితులు గురువారం హైదరాబాద్లో గల అరణ్య భవన్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి ఈ మేరకు ఆహ్వానించారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 21న రాములవారి కళ్యాణం జరుగనుంది. కల్యాణ మహౌత్సవంకు రావాలని రామయ్య ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు.