Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డుకున్న స్థానికులు, కుటుంబ సభ్యులు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం మాడ వీధుల విస్తరణలో భాగంగా పరిసర ఇండ్ల స్థలాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ క్రమంలో బాధితులకు నష్టపరిహారం సైతం అందజేసింది. పరిహారం పొందిన వారు తమ సొంత స్థలాల్లో తిరిగి ఇండ్ల నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో యం.రాజు అనే దివ్యాంగుడు తన కుటుంబంతో కలిసి రామాలయ పరిసరాల్లో ఉన్న తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టాడు. అయితే అతని ఇంటి వెనుక వైపు ఉన్న గుట్టను తవ్వుతున్న సమయంలో రామాలయ అధికారులు అడ్డుకుని గుట్టను తవ్వేందుకు వీలు లేదని పేర్కొన్నారు. నిర్మాణం నిలుపుదల చేయాలని అధికారులు ఆదేశించారు. అనంతరం అతను మనస్తాపానికి గురై ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. చుట్టు పక్కల వారు, బంధువులు రాజును అడ్డుకుని బిందెలతో నీళ్ళు పోశారు. తనపై కక్ష్యపూరితంగా వ్యవహరిస్తూ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.