Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి
- కమిషనర్‌కు వ్యతిరేఖంగా రిలే నిరాహార దీక్షలు
- మద్దతు తెలిపిన కార్మిక సంఘాలు
నవతెలంగాణ-మణుగూరు
గత ఐదు నెలలుగా పెండింగ్‌లో వున్న వేతనాలను వెంటనే చెల్లించాలని, విధుల నుండి తొలగించిన కార్మికులను వెంటనే పనుల్లోకి తీసుకోవాలని అఖిలపక్ష కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మున్సిపల్ కార్యాలయం ముందు కమిషనర్‌కు వ్యతిరేఖంగా రిలే నిరహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... కార్మికుల పట్ల కమిషనర్ నోటి దురుసుతనాన్ని తగ్గించుకోవాలని, ఇష్టానుసారంగా మాట్లా డం సరికాదన్నారు. కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎంవి.రెడ్డి, ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఆర్డీఎంఏ, సీడీఎంఏలకు వినతి పత్రాలు పంపిస్తున్నట్టు కార్మికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయులు నెల్లూరి నాగేశ్వరరావు, నందం ఈశ్వర్రావు, బోల్లం రాజు, ఏఐటీయూసీ నాయకులు దుర్గ్యాల సుధాకర్ మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.