Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దమ్మపేట
అశ్వారావుపేట నియోజక వర్గం నుంచి మహాకూటమి తరఫున పోటీ చేసి శాసనసభ్యుడుగా గెలిచి, నియోజక వర్గ ప్రజలను మోసం చేసి, వారి ఓటును అవహేళన చేసి, టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళినం దుకు నిరసనగా గురువారం స్థానిక సీపీఐ కార్యాలయం నుండి హైస్కూల్ వరకు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దిష్టిబొమ్మను మహాకూటమి కార్యకర్తలు దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సున్నం నాగమణి, మండల అధ్యక్షుడు మద్దిశెట్టి సత్యప్రసాద్, సీపీఐ మండల నాయకులు పండూరి వీరబాబు మాట్లాడారు. అధికారం, డబ్బు దాహంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్లే మెచ్చా నాగేశ్వరరావు తక్షణం రాజీనామా చేయాలన్నారు. లేకపోతే అడుగడుగున అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈశ్వరికుమారి, కందుల వెంకటేశ్వరరావు, చిలక శ్రీను, మోహన్రావు, రాములు తదితరులు పాల్గొన్నారు.