Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాల్సిందే
- యాజమాన్యం స్పందించకపోవడంతోనే సమ్మె నోటీస్
- యుఈఈయు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అంకిరెడ్డి
నవతెలంగాణ-పాల్వంచ
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేకంగా పరిగణించి ఉద్యోగ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాల్సిందేనని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అంకిరెడ్డి నర్సింహారావు ప్రభుత్వం జెన్కో యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. విద్యుత్‌రంగంలో ఉన్న అనేక సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా ఆందోళనలు చేపట్టినా పట్టించుకోకపోవడం వల్లే ఈ నెల 6న సమ్మె నోటీస్ ఇచ్చిన సందర్భంగా ఆయన పాల్వంచలో నవతెలంగాణతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర సాధనలో నిర్విరామంగా ఉధ్యమంలో ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడిన ఉద్యోగ కార్మికులకు ఇప్పటివరకు సమస్యలు పరిష్కారం కాకపోవడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పూర్తిగా పరిష్క రిస్తామని అనేకసార్లు హామీలు ఇచ్చినప్పటికీ వాటిని పరిష్కరించడంలో మాత్రం ప్రభుత్వం యాజమాన్యం విఫలమయ్యారని ఆరోపించారు. ప్రజలకు 24 గంట లు కరెంటు అందిస్తూ 365 రోజులు ఎండనకా వా ననకా చలి అనకా పనిచేస్తున్నారని అన్నారు. జెన్కో కోల్‌ప్లాంట్, యాష్‌ప్లాంట్, దుమ్ము దూళీలలో అనేక కష్టనష్టాలకు ఓరుస్తూ ఒటుట్రాన్స్కో, డిస్కంలలో విద్యుత్ సరఫరా కోసం 24 గంటలు పనిచేస్తూ లైన్ల కింద రేడియేషన్‌ను భరిస్తూ విధి నిర్వహిస్తున్న విద్యుత్ ఉద్యోగులందరికీ ఈ తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా చూడాలని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ ఎల క్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వ ర్యంలో అనేక ఆందోళనలు నిర్వహించామని హైదరా బాద్‌లో లేబర్ కమిషన్ ఎదుట వరంగల్, ఎస్పీడీ సీఎల్ ఎదుట ధర్నా నిర్వహించామని డిసెంబర్ 15న ఒకరోజు రిలే దీక్షలు చేపట్టామని అయినప్ప టికీ యాజమాన్యం పట్టించుకోకపోవడం వల్లే తప్పనిసరి పరిస్థితిలోనే ఈ సమ్మె నోటీస్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు.
విద్యుత్ రంగంలో 1999 తర్వాత ఉద్యోగంలో చేరినవారికి ఈపీఎఫ్ నుండి జీపీఎఫ్ వర్తింపజేయా లని జీపీఎఫ్ రావాల్సిన ఉద్యోగులు 4500 మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. ప్రభుత్వం తలుచుకుంటే జీపీఎఫ్ పెన్షన్ ఇవ్వచ్చని దానికోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి కనీస పెన్షన్ 30 వేలు ఇవ్వచ్చని అన్నారు. అంతేకాకుండా ఉద్యోగి వాటా, బోర్టు వాటా ఎక్కువగా రికవరీ చేయవచ్చని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, యాజమాన్యం స్పందించి మానవతా దృక్పదంతో స్పందించి 1999 తర్వాత చేరిన ఉద్యోగులకు ఈఈఎఫ్ నుండి జీపీఎఫ్ పెన్షన్ ఇవ్వాలని ఆర్టీజన్లకు ఎస్పిఎస్ఈబి రూల్స్ వర్తింపజేయాలని అన్నారు. ఆర్టీజన్లను ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాంఢ్ చేశారు.