Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాయిదా పడ్డ సీతమ్మ సాగర్ భూ నిర్వాసితుల గ్రామ సభలు
- ఎకరాకు రూ.50 లక్షలు, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి : భూ నిర్వాసితులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
దుమ్ముగూడెం గోదావరి నదిపై నిర్మించే సీతమ్మ సాగర్ బహుళార్దక సాధక ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతుల విషయంలో అధికారులు ఆది నుండి దాట వేత ధోరణి అవలింభిస్తున్నారనే ఆరోపణలు రైతుల నుండి సర్వత్రా విన్పిస్తున్నాయి. భూ సేకరణ అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు దుమ్ముగూ డెం, చర్ల మండలాలకు చెందిన నిర్వాసిత రైతులను గ్రామ సభల పేరుతో భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయానికి పిలిచి ఆయన గ్రామ సభలకు హాజరు కాక పోవడంపై నిర్వాసిత రైతులనుండి విమర్శలు విన్పిస్తున్నాయి. ఆ సమయంలో రైతులు కోవిడ్-19 సెకండ్ వేవ్‌తో పాటు ఎండ తీవ్రతలు, వ్యవశాయ పనుల ఒత్తిడి ఉన్నందున గ్రామ సభలు గ్రామ పంచాయతీ కార్యాలయాలు, రైతు సేవా కేంద్రాలలో నిర్వహించా లని వినతి పత్రం అందజేసినట్టు రైతులు తెలుపుతు న్నారు. మొదట భూములను ఎంజారు మెంట్ సర్వే చేసే ముందు ప్రజా అవసరాలకు కోసం నిర్మించే సాగు నీటి ప్రాజెక్టుల విషయంలో భూ సేకరణ చట్టం ప్రకారం 70 శాతం మంది నిర్వాసిత రైతులు అంగీకారం చెబితేనే సర్వే అధికారులు సర్వే చేయాల్సి ఉంటుంది. అదేమీ లేకుండానే రెవెన్యూ, సర్వే సిబ్బంది, సీతమ్మ సాగర్ నిర్మాణ పనులు దక్కించు కున్న ఎల్ అండ్ టి సంస్థ ఏక పక్షంగా భూ సర్వే పనులు చేపట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. సర్వే అన ంతరం రెవెన్యూ అధికారులు గ్రామాల్లోకి వచ్చి భూ ములు కోల్పోతున్న రైతుల ఆధార్, బ్యాకు అకౌంట్లు, పాసు పుస్తకాల జిరాక్స్‌లు సేకరించారు. ఆ సమయంలో కొంత మంది రైతులు దీనిని పూర్తిగా వ్యతిరేకించారు.
ప్లీమరీ నోటిఫికేషన్ : సర్వే అనంతరం భూములు కోల్పోతున్న రైతుల వివరాలతో అధికారులు ప్లీమరీ నోటిఫికేషన్ విడుదల చేయాలి. దీని విడుదల అనంతరం ప్రభుత్వ నిబందనల ప్రకారం రైతులు ఎమైనా అభ్యంతరాలు ఉంటే 60 రోజుల్లో తెలియజేయాల్సి ఉంటుంది. అనంతరం పబ్లిక్ డిక్లరేషన్ పేరుతో రైతుల పేర్లతో గెజిట్‌ను విడుదల చేసినప్పటికీ 30 రోజుల్లో అభ్యంతరాలు తెలియజే యాలి అనే విషయాన్ని అందులో పొందుపరచక పోవడంతో రైతులు అభ్యంతరాలు తెలియపరచలేక పోయామని రైతులు ఆరోపిస్తున్నారు.
వాయిదాపడ్డ గ్రామ సభలు : సీతమ్మ సాగర్ భూ నిర్వాసితుల కోసం శుక్రవారం నిర్వహించాల్సిన గ్రామ సభలు వాయిదా పడ్డాయి. సీతమ్మ సాగర్ భూ సేకరణ అధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ కె. వెంకటేశ్వర్లు గ్రామ సభలకు రాక పోవడం వలన వాయిదా పడ్డట్లు అధికారులు తెలపడంతో పాటు నిర్వాసిత రైతుల నుండి పలు వినతులు స్వీకరించారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారంపై రైతులు అధికారులను నిల దీశారు. సీతమ్మ సాగర్ నిర్మాణంతో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.50 లక్షల చెల్లించాలని, జలవిద్యుత్ కేంద్రంలో ఇంటికి ఒక ఉద్యోగం కల్పించాలని, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని, తక్కువ మిగులు భూమిని సేకరించాలని కోరుతూ జూపెల్లి కిరణ్ అధ్వర్యంలో రైతులు అధికారులకు వినతి పత్రం అందజేశారు. గ్రామ సభల్లో డీఏఓ రాజన్న కుమార్, తహశీల్దార్ రవికుమార్, వీపీసీ రమణారావు, ఆర్ఐ ఆదినారా యణ, సర్పంచ్ కనకదుర్గ, పంచాయతీ కార్యదర్శి స్రవంతి, వీఆర్వోలు మధు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.