Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పచ్చటి అడవుల్లో రక్తపుటేరులు ఎన్నాళ్లు
- విప్లవ బోధనలకు విరుగుడు ఏది
- ఖాకీకి కక్ష తీరేది ఎప్పుడు
- అడవి జీవితాలకు ఆదరణ ఎప్పుడు
నవతెలంగాణ-చర్ల
చంద్రునిపై మనిషి జీవనం సాగించే కంప్యూటర్ యుగం.. సముద్రపు అడుగు సైతం లెక్కించే అధునాతన యంత్రాలు... రెప్పపాటులో వేల కిలోమీ టర్ల ప్రయాణం... కత్రిమ అవయవాల అమరికతో మనిషికి ప్రాణం పోసే వైద్యం... అభివృద్ధి అంతా ఒక పక్కన ఉంటే సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో పోలీస్ వర్సెస్ మావోయిస్టు ఫలితంగా నానాటికీ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది.
దశాబ్దాలుగా విప్లవవర్గాల పోరు కొనసాగుతూనే ఉంది. ఆర్థిక, సామాజిక సమీకరణాలు మావోయి స్టుల ఉద్యమ తీవ్రతను కొంతమేరకు చల్లార్చుతున్న ప్పటికీని.. కొనసాగే స్వభావాన్ని మాత్రం మార్చలేక పోతున్నాయి. అదే క్రమంలో... తూటా పేలిన ప్రతిసారి శాంతి చర్చలు అంటున్న ప్రభుత్వాలు... శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయక అశ్రద్ధ ధోరణి అవలంభిస్తున్నాయి. తప్పు ఒప్పులు ఎవరివైనా ..లోపాలు ఎక్కడ ఉన్నా.. నాటి నుండి నేటి వరకు బలవుతోంది సామాన్య ఆదివాసీలే.
ఆధిపత్య పోరుతో అటు మావోయిస్టులు, పోలీసులు మధ్య ఛత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న నరమేధానికి అంతిమంగా ముగింపు ఎప్పుడు? చత్తీస్‌గఢ్‌లో శాంతి నెలకొనేది ఎన్నడూ అని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇద్దమే... మావోయిస్టులను అంతమొందించే వరకు నిద్రపోము తగిన రీతిలో ప్రతీకారం తప్పదు బీజాపూర్ ఎన్కౌంటర్ తర్వాత చత్తీస్‌గఢ్ జగదల్పూర్లో కేంద్ర హౌంమంత్రి అమిత్ షా చేసిన కీలక ప్రకటన ఇది. కానీ, ప్రభుత్వాలు ఒక్క విషయాన్ని గమనించాలి. ఇది ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క మరణానికో సంబంధించిన సమస్య కాదు. గడిచిన ఐదు దశాబ్దాల క్రితం ఉత్తర బెంగాల్‌లోని నక్సల్బరీ పోరాటంతో మొదలై, ఇటీవల భీజాపూర్ భీకర పోరు వరకు పరిస్థితులను బట్టి వామపక్ష తీవ్రవాదం అనునిత్యం ఉరుముతునే ఉంది. సమయం, ప్రాంతం బట్టి తీవ్రత కొంత మారినా చల్లబడ్డారు అనుకున్న ప్రతిసారి రెట్టింపుగా మావోయిస్టులు విరుచుకుపడుతునే ఉన్నారు .
1977 నుంచి 2003 దాకా ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా సాగిన నక్సలైట్ ఉద్యమ రెండో దశలో ప్రజా సంఘాలు, ప్రజోద్యమాలు కీలక పాత్ర పోషిం చాయి. మేధావులూ ఉద్యమంలో భాగస్వాముల య్యారు. ఈ ప్రభావం ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో, తర్వాత మధ్య ఝార్ఖండ్‌లో కనిపిం చింది. పచ్చని దండకారణ్య మావోయిస్టుల నివాస స్థావరం అయింది. దండకారణ్యం అంటే దక్షిణాన ఆంధ్రప్రదేశ్, పశ్చిమాన మహారాష్ట్ర, తూర్పున ఒడిశా సరిహద్దుల్ని ఆనుకుని ఉన్న ఆదివాసీ ప్రాంతంతో పాటు బీజాపూర్, దంతేవాడ, సుకుమా జిల్లాలలో సరిహద్దుగా ఉన్న అడవిని దండకారణ్యగా చెప్పవచ్చు. ఛత్తీస్‌గఢ్ లోని బస్తర్ కూడా ఉద్యమా నికి కేంద్రం అయింది. ఆదిలో పీపుల్స్‌వార్ పార్టీ నక్సలైట్లుగా మారి నేడు మావోయిస్టులుగా కొనసా గుతున్న ఉద్యమకారుల పందా విప్లవ బోధనలతో పచ్చటి అడవుల్లో నెత్తుటి ప్రవాహంకు మూలం మావోయిస్టులే కదా అంటున్నా పలువురు విశ్లేషకులు. పిఎల్‌జిఎ దళాలను ఏర్పాటు చేసి మారణహౌమాలు ఆగకుండా మనిషిని మనిషే చంపే పైశాచికత్వానికి నడుంబిగించారు అని పలువు రు ఆందోళన చెందుతున్నారు. బస్తర్ ప్రాంతం మావోయిస్టు ప్రతిఘటనోద్యమాలకు కంచుకోటగా మారిందని చెప్పవచ్చు. కొందరు జనస్రవంతిలో కలవాలని కాలానికి అనుగుణంగా సామాజిక, ఆర్థిక, విద్య వంటి అంశాలు విప్లవంలో చీలికలు తీసుకు వచ్చాయి. ఆ మార్పుల్లో ఇమడలేని వారు జనజీవన స్రవంతిలో కలిశారు. మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. కారణాలేవైనా ఉద్యమం అప్పుడు-ఇప్పుడూ ఒకరకంగా ప్రస్థానం సాగించడం లేదనేది వాస్తవం. అయితే, విప్లవ సమీకరణ ఎలా కొనసాగింది అన్నది ప్రధానమైన ప్రశ్న. అందుకు ప్రధాన కారణం.. ఝార్ఖండ్ గెరిల్లా ప్రాంతంలోని అల్పాషా గిరిజనులకు, మావోయిస్టు సంస్థకు మధ్య సన్నిహిత సంబంధాలే. పోరాటం కొనసాగుతున్న ప్రాంతాలలో గిరిజనులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం, విప్లవ అభివృద్ధి క్రమాన్ని అర్థం చేసుకోవడం, నిరంతరం జనసమీకరణ కొనసాగడం ఇంతకాలంగా ఉద్యమానికి ఊపిరి పోశాయి. అక్కడ వారి మధ్య నిత్యం యుద్ధమే. దేశంలో మిగతా ప్రాంతాల కంటే.. బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య యుద్ధం నిత్యం నడుస్తోంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ 3200కు పైగా ఎన్కౌంటర్లు జరిగినట్లు సమాచారం. హౌంశాఖ నివేదిక ప్రకారం జనవరి 2001 నుంచి 2019 మే వరకు వామ పక్ష తీవ్రవాద హింసలో 1002 మావోయిస్టులు, 1234 మంది భద్రతా సిబ్బందిమరణించి ఉన్నట్లు సమాచారం . అంతేకాకుండా 1782 మంది సాధారణ పౌరులు కూడా బలయ్యారు. ఇప్పటివరకు 3896 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల మధ్య అప్పుడప్పుడు శాంతి చర్చల మాట వినిపిస్తుంది. తర్వాత దాని గురించి ఎవరూ పట్టించుకోరు. బస్తర్ నుంచి భద్రతా దళాలను వెనక్కి పిలవాలని, మావోయిస్టు నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గత నెలలో కూడా మావోయిస్టులు శాంతి చర్చలకు పిలుపు నిచ్చారు. కానీ వారి డిమాండ్లు నెరవేర్చలేమని, ముందు తుపాకులను వదలాలని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ''లోన్వరాటు'' అనే కార్యక్రమం పెట్టి మావోయిస్టు లను కొంత మేరా పొంగి పోయే విధంగా చర్యలు చేపట్టింది. హింస తుపాకీ వీడిన నాడే చర్చల గురించి మాట్లాడాలంటూ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తెలి పింది. మావోయిస్టులు ఆయుధాలు వదులు కోవటా నికి మావోయిస్టు ఇష్టపడలేదు. ప్రభుత్వాలు మారిన ప్పుడల్లా ఎన్నికల్లో ప్రధానంగా వినిపించే అంశం నక్సలిజం అంతం హామిలుగానే మిగిలిపోతున్నాయి.