Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వం ప్రకటించిన రూ.2 వేలు కంటి తుడుపు చర్య
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేస్తున్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి నెలకు రూ.10వేల కరోనా భృతి ఇవ్వాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. శుక్రవారం స్థానిక మంచికంటి భవన్లో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.2వేలు, 25 కేజీల బియ్యం అది కంటి తుడుపు చర్య మాత్రమేనని తెలిపారు. ఈ ప్యాకేజి వారి ఆకలి తీర్చదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం గతంలో విధించిన లాక్ డౌన్ వలన ఒక వైపు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు వేతనాలు ఇవ్వక మరో వైపు ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్ధిక సహాయం అందక ప్రైవేటు విద్యాసంస్థలో పని చేస్తున్న సిబ్బంది ఆర్ధికంగా చితికిపోయి కుటుంబాలు గడవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారని అయన ఆవేదన వ్యక్తం చేసారు. ప్రస్తుతం ప్రభుత్వం విద్యాసంస్థలు ప్రారంభించినట్టు చేసి కరోనా పెరుగుతుందనే సాకుతో అర్ధాంతరంగా విద్యసంస్థలు మూసివేసి వారిని రోడ్డు పాలు చేసిందని విమర్శించారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసమే ప్రభుత్వం విద్యాసంస్థలు ప్రారంభించినట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేసారు. బార్లకు, సినిమా హాళ్ళకు లేని కరోనా విద్య సంస్థలకే ఉందా....? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటిస్తూ విద్య సంస్థలు ప్రారంబించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పది నెలల పాటు సిబ్బందికి రూ.పదివేల కరోనా బృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసా రు. ప్రభుత్వ సాయం లేక విద్యావంతులు గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ వయస్సు పెంచిన ప్రభు త్వం ప్రైవేట్ సిబ్బంది కనీసం ఆదుకునే ప్రయత్నం ఎందుకు చేయదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రైవేట్ విద్య సంస్థల్లో పని చేస్తున్న సిబ్బందిని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కాసాని ఆయిలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, కార్యదర్శివర్గ సభ్యులు ఎజె.రమేష్, కొక్కెరపాటి పుల్లయ్య, అన్నవరపు సత్యనారా యణ, జిల్లా కమిటీ సభ్యులు మర్లపాటి రేణుక, జాటోత్ కృష్ణ, కున్సోత్ ధర్మ, ఎస్ఏ.నభి, లిక్కి బాలారాజు, కె.బ్రహ్మాచారి, పద్మ, పిట్టల ఆర్జున్, చిలకమ్మ, దొడ్డ రవి, రేపాకుల శ్రీను, నిమ్మల వెంకన్న యలమంచి వంశీ, కారం పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.