Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం సహకార సంఘం ఆధ్వర్యంలో త్వరలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు సహకార సొసైటీ అధ్యక్షు లు మండె వీరహనుమంతరావు తెలిపారు. శుక్రవారం విద్యానగర్ కాలనీలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యవర్గ సమావేశం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు శాసన సభ్యులు వనమా వెంకటేశ్వర రావు ఆదేశాల మేరకు సుమారు 8 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు కూచిపూడి జగన్నాధ రావు, సొసైటీ సీఈఓ పి.సారయ్య, సొసైటి డైరెక్టర్లు, వేల్పుల మల్లేష్, బండి అమృతరావు తదితరులు పాల్గొన్నారు.