Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండల పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనల్లో భాగంగా శుక్రవారం ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా టీఆర్ఎస్ నాయకులు నకిరిపేట గ్రామంలో ప్లేక్సీలను ఏర్పాటు చేశారు. అదే విధంగా గ్రావెల్ రోడ్డు నిర్మాణంలో భాగంగా శిలఫలాకాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గుర్తు తెలియని దుండగులు గురువారం శిలఫలకాన్ని ద్వంసం చేయగా గురువారం రాత్రి సమయంలో ప్లేకీలపై పేడను చల్లారు. ఇదిలా ఉండగా ట్రాక్టర్ ఢకొీనడంతో శిలఫలకం దిమ్మ కూలినట్టు స్థానిక నాయకులు పేర్కొంటున్నారు. కాగా ఈ విషయంపై ఎస్ఐ బాలకృష్ణను నవతెలంగాణ వివరణ కోరగా రేగా ఫ్లేక్సీలపై పేడ చల్లి, శిలాఫలకం ధ్వంసంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.