Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
ఐఎన్‌టీఎస్‌వో ఫలితాల్లో మణుగూరు గౌతమ్ మోడల్ స్కూల్ (టెక్నో కరికులమ్) విద్యార్ధులు ప్రభంజనం సృష్టించారు. శుక్రవారం పాఠశాల ఆవరణ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్ధులను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్స్‌పాల్ బి.ఎస్.కె.ఎస్.ఎన్. ప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ... ఐఎన్‌టీఎస్‌వో 2021 ఫలితాల్లో తమ విద్యార్ధులు మరో సారి ప్రతిభ కబర్చడం జరిగిందన్నారు. ఎంటీఎస్వో 17, జీటీఎస్వో 11, ఈటీఎస్వో 12, ఏటీఎస్వో 8, ఎస్టీఎస్వో 14లు ఈ విధంగా మొత్తంగా 62 మంది విద్యార్ధులు సెలక్ట్ అయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, ప్రైమరీ ఇన్చార్జ్ మౌనిక, ఉపాధ్యాయులు, విద్యార్ధులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.