Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఆర్డీఓ కార్యాలయం ముందు సీపీఐ కౌన్సిలర్ల నిరసన
నవతెలంగాణ-కొత్తగూడెం
అర్హులైన పేదలందరికీ వృద్ధాప్య, వితంతు పింఛన్లు మంజూరు చేయాలని, సోషల్ ఆడిట్ పేరుతో తొలగించిన పింఛన్లను పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొత్తగూడెం మున్సిపల్ సీపీఐ కౌన్సిలర్లు నిరసన, ధర్నా చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం, డీఆర్డీఏ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించి అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సి లర్లు కంచర్ల జమలయ్య, బోయిన విజరు ఉమార్, భూక్య శ్రీనివాస్, పి.సత్యనారాయణచారి, నేరెళ్ళ సమైఖ్య, మాచర్ల రాజకుమారి పాల్గొన్నారు.