Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలకు 10 వేల రూపాయలు ఇవ్వాలి
- ఆత్మహత్యకు పాల్పడిన రవి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలి
- కార్పొరేట్ విద్యా సంస్థల్లో జీతాలు ఇప్పించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-ఖమ్మం ప్రాంతీయప్రతినిధి
ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో పనిచేస్తున్న టీచర్లు, సిబ్బందికి నెలకు రూ.2వేలు, 25 కేజీల బియ్యం యిస్తామని ముఖ్యమంత్రి కె.సి.ఆర్. ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఈ నిర్ణయం సహేతుకంగా లేదని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ప్రభుత్వం యిచ్చేది కనీసం ఇంటి అద్దెకు కూడా సరిపోదన్నారు. కనీసం నెలకు 10 వేల రూపాయలు లేకుండా అతి సాదాగా జీవించటం కూడా సాధ్యం కాదన్నారు. ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని పునరాలోచించి 10 వేలు యివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన ప్రైవేటు దంపతులు రవి, అక్కమ్మల అనాధలైన పిల్లలకు రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా యివ్వాలని కోరారు. ప్రభుత్వం కల్పించిన అవకాశంతో ఫీజులు దండుకున్న కార్పొరేట్ విద్యా సంస్థల నుండి పూర్తి జీతాలను, బకాయిలను యిప్పించాలని, అందుకోసం ప్రత్యేక జి.ఓ. యివ్వాలని కోరారు. విద్యా సంస్థలు ప్రారంభించకుంటే, మధ్యాహ్న భోజన పథకం డబ్బులను విద్యార్థుల కుటుంబాలకు యివ్వాలని కోరారు. ప్రైవేటు అధ్యాపకులకు ప్రభుత్వం సహాయం ప్రకటించాలనే డిమాండ్‌తో సిపిఎం వివిధ రాజకీయ పక్షాలను కలుపుకొని చేసిన పోరాటానికి ప్రభుత్వం స్పందించిందని ఆయన గుర్తు చేశారు. 10 వేల రూపాయలు ఇచ్చే దాకా తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.