Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిషన్ భగీరధ పనుల్లో నాసిరకం
- పరిశీలించిన సీపీఐ(ఎం) బృందం
నవతెలంగాణ-కారేపల్లి
కారేపల్లి మండలంల పాటిమీదిగుంపులో తాగునీటి తీవ్రంగా ఉందని సీపీఐ(ఎం) నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం పాటిమీది గుంపులో సమస్యలపై సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. ఈసందర్బంగా సీపీఐ(ఎం) నాయకులు మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి బోర్లు మరమ్మతులకు నోచుకోవటం లేదన్నారు. రిపేర్ల, పూడికతీత పేరుతో నెలల తరబడి బోర్లు విప్పి పక్కన పెట్టారని వారు విమర్శించారు. గ్రామంలో ఉన్న 9 బోర్లు ఒకేసారి రిపేరు అంటూ ఊడబెరకటంతో గ్రామస్తులు నీటికి ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరధ పనులు నాసిరకంగా ఉన్నాయని, పైప్ లైన్ను తక్కువ లోతు ఉంచటంతో అవి బయటకు కనిపిస్తున్నాయని, దీనివల రాబోయే రోజుల్లో అవి పగిలే అవకాశం ఉందన్నారు. గ్రామపంచాయతీ ల్లో నాసికరం పనులు నడస్తున్నా సర్పంచ్, అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపిం చారు. వేసవీలో తాగునీటి ఎద్దటి లేకుం డా అధికారులు చర్యలు తీసుకోవాలని, నాసిరకం పనులను చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బానోత్ బావుసింగ్, రాంబాబు, మోతి, సురబాక సర్వయ్య, మమత, సూరబాక ధనమ్మపాల్గొన్నారు.