Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు
నవతెలంగాణ-వైరా టౌన్
రైతుల ఆదాయం 2022 నాటికి రెట్టింపు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తూనే రైతులు వినియో గించే ఎరువులు ధరలు రెట్టింపు చేయడం జరిగిం దని తెలంగాణ రైతు సంఘం అధ్యక్షులు బొంతు రాంబాబు అన్నారు. శుక్రవారం ఢల్లీీ, సింగు సరిహద్దులో పెంచిన ఎరువు లు ధరలు వెంటనే తగ్గించాలని రైతులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సింగు రైతు ఉద్యమ కేంద్రంలో జరిగిన సభలో బొంతు రాంబాబు మాట్లాడుతూ గత సంవత్సరం కాలంలో దేశంలో అంబానీ, అదానీ ఆస్తులు రెట్టింపు కావటం జరిగిందని అన్నారు. దేశంలో రైతులతో సహా వివిధ వర్గాల ప్రజలు కరోనా వలన ఆదాయాలు కోల్పోయి జీవనం కష్టబరితం అవుతున్న సమ యంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాల వలన అంబానీ, అదానీ ఆస్తులు రెట్టింపు కావటం జరిగిందని అన్నారు. ఎరువుల ఉత్పత్తి కంపెనీల చిన్న విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని 50 శాతం ఎరువుల ధరలు పెంచిందని, రైతులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని, వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలు చట్ట బద్దంగా చెల్లించడానికి పార్లమెంటులో చట్టం చేయాలని గత మూడు సంవత్సరా లుగా ఉద్యమాలు చేస్తున్నారని, ఐదు నెలలగా ఢల్లీీ సరిహద్దులలో రైతులు బైఠాయించి పోరాటం చేస్తున్న ప్రభుత్వం స్పందించటం లేదని అన్నారు. రైతుల ప్రయోజనాల రక్షణ కు రైతుల ప్రతిఘటన, పోరాటమే మార్గమని అన్నారు. ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ విధానాలు అనుస రిస్తున్న రాజకీయ పార్టీలను పరిపాల నకు దూరంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు చింతనిప్పు చలపతిరావు, రైతు ఉద్యమ నాయకులు ప్రతీప్ సింగ్, సుర్జీత్ సింగ్ పాల్గొన్నారు