Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఖమ్మం
అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని సీఐటీ యూ ఆధ్వర్యంలో శుక్రవారం ఐసీడీఎస్ పీడీకీ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడ లీ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్సులు పిన్నింటి రమ్య, కే సుధా రాధా మాట్లాడుతూ అంగన్వాడి ఆన్లైన్ సర్వే సందర్భంగా వస్తున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని, స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని, నెట్ బ్యాలెన్స్ ఇవ్వాలని, సిగల్స్ లేని ప్రాంతాలను పరిగణలోకి తీసుకోవాలని, సర్వే చేయడానికి ఇబ్బందులు పడుతున్న వయసు పైబడ్డ వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని, ఆన్లైన్ సర్వే కు వేతనాలకు, పోషకాహారానికి లింకు పెట్టొద్దని అన్నారు. కార్యక్రమంలో నాయకులు కోటేశ్వరి.కే ఉమా తదితరులు పాల్గొన్నారు.