Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- సత్తుపల్లి
సత్తుపల్లి మండలం రామగోవిందాపురంలో గురువారం అర్థరాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ పూరిల్లు అగ్నికి ఆహుతై సర్వస్వం కోల్పోయిన కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆసరాగా నిలిచారు. శుక్రవారం గ్రామానికి వెళ్లి అగ్నికి ఆహుతైన ఇంటిని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. తక్షణ సాయం కింద రూ. 5వేలు నగదుతో పాటు రూ. 10వేలు విలువగల నిత్యావసర సరుకులు, బియ్యం, వంటపాత్రలను అందించారు. వీటితో పాటు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 8వేల చెక్కును అందించారు. ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరు చేయిస్తానని బాధిత కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే సండ్ర హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు కేవీఎంఏ మీనన్, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, ఎంపీపీ దొడ్డా హైమవతిశంకరరావు, జెడ్పీటీసీ కూసంపూడి రామారావు, ఎంపీడీవో చిట్యాల సుభాషిణి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, దొడ్డా శంకరరావు, కాశీం, గాయం రాంబాబు, గంగారం సర్పంచ్ వాసురెడ్డి, రామగోవిందాపురం గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.