Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా పరిషత్ చైర్మన్ కమల్రాజు
నవతెలంగాణ- బోనకల్
రాపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ మోదుగు రవి బాబు మృతి ఆ కుటుంబానికి తీరని నష్టమని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని రాపల్లి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ మోదుగు రవిబాబు విధులలో ఉండగానే గుండెపోటుతో మృతి చెందాడు. విధులు నిర్వహిస్తూ రవిబాబు మృతి చెందడంతో ప్రభుత్వం లక్ష రూపాయలను మంజూరు చేసింది. మంజూరైన లక్ష రూపాయల చెక్కును మృతుని భార్య రాంబాయికి రాపల్లిలో జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు అందజేశారు. చిన్న బీరవల్లి గ్రామంలో రావి రామ్ మోహన్ రావు తల్లి దశదినకర్మ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు కృషితో మంజూరైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బాధితులకు చెక్కులను పంపిణీ చేశారు. రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్, మాజీ జడ్పీటీసీ బానోతు కొండ,రాపల్లి సర్పంచ్ మందడపు తిరుమలరావు, బ్రాహ్మణపల్లె ఎంపిటిసి చేపూరి సునీత ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవి, గంగ దేవుల రామక్రిష్ణ , పెనుకొండ ఏడుకొండలు , ఇటికాల శ్రీనివాసరావు, గాదె నరోత్తం రెడ్డి,కాకాని శ్రీనివాసరావు, బోనకల్లు ఉపసర్పంచ్ యార్లగడ్డ రాఘవరావు సండ్ర వెంకట్రావు కన్నేటి సురేష్ వివిధ గ్రామాల ఆ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు