Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలపై అధికారులను నిలదీసిన సభ్యులు
నవతెలంగాణ-కరకగూడెం
మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రేగా కాళికా అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సభ్యులు పలు సమస్యలపై అధికారులను నిలదీశారు. మొదట ఆరోగ్యం, రెవెన్యూ ఇతర శాఖలపై రివ్యూ నిర్వహించారు. అనంతరం తాగు నీటి సమస్యపై వచ్చే వరకు సమావేశం రసాభాసగా సాగింది. మిషన్ భగీరథ పనులపై ఏఈ విజయకృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్రామాల్లో దాదాపుగా అన్ని వాటర్ ట్యాంకుల నిర్మాణం పూర్తయిందని, ట్యాంకుల ద్వారా తాగునీరు సరఫరా అవుతుందని వివరించారు. అనంతరం పలువురు సభ్యులు మాట్లాడుతూ ఏఈ చెబుతున్న మాటలన్నీ కాగితాలకే పరిమితం అయ్యాయని, ఇక్కడ వాటర్ ట్యాంకులు అనుకున్న విధంగా పూర్తి కాలేదని తెలిపారు. ఈ విషయమై తప్పుడు లెక్కలు చెప్పవద్దని ఏఈని ఎంపీపీ రేగా కాళికా మందలించారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ మండలంలో ఒక్కరే కాంట్రాక్టర్ వుండడంతో మనులు ఆలస్యమైతున్నాయిని ఆయన అన్నారు. అనంతరం కరకగూడెం, బట్టుపల్లి సర్పంచ్లు ఊకె రామనాధం, తొలెం నాగేశ్వరరావు మాట్లాడుతూ కొన్ని పంచాయతీలో మిషన్ భగీరథ కాంట్రాక్టర్ ఒకే ఇంటికి ఒకటి లేక రెండు కనెక్షన్ ఇస్తున్నారని అలాగే కాళీ ఇండ్ల స్థలాలో పంచాయతీ సిబ్బందికి తెలపకుండా బిగిస్తూన్నారని అన్నారు. ఎంపీపీ రేగా కాళికా ఏఈ విజయకృష్ణ వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని అన్నారు. మండలం మిషన్ భగీరథ పనులను త్వరగతిగా పూర్తి చేయాలని ఎంపీపీ రేగా కాళికా, స్పెషల్ ఆఫీసర్ రమాదేవి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో డి.శ్రీను, తహసీల్దార్ శేషగిరిరావు, వైస్ ఎంపీపీ ఆయాబ్ ఖాన్, ఎంపీఓ సునీల్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.