Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బస్తర్ ఐజీ సుందర్ రాజ్ జేపీ
నవతెలంగాణ-చర్ల
కొన్ని మీడియా, సోషల్ మీడియా నివేదికలలో, అరెస్టు చేసిన మావోయిస్టు కేడర్‌ను ఏప్రిల్ 03వ తేదీన బీజీపూర్ డిస్ట్రిక్ట్‌లో టెకల్గూడెం ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులు అపహరించిన కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్‌ను సురక్షితంగా విడుదల చేసినందుకు బదులుగా అప్పగించినట్టు ప్రచురించబడటం వాస్తవం కాదని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ జెపీ ఓ ప్రకటనలో తెలిపారు. అపహరణకు గురైన కోబ్రా జవాన్ విడుదల కోసం అరెస్టు చేసిన మావోయిస్టులను విడుదల చేయలేదని ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేశారు. టెకల్గూడెం ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఎన్కౌంటర్ తర్వాత బేస్ క్యాంప్ వరకు కొద్దిమంది గ్రామస్తులు జవాన్లతో కలిసి వచ్చారు. నిర్ణీత సమయంలో తిరిగి వారి గ్రామాలకు తిరిగి వెళ్లారు. ఏప్రిల్ 03న జరిగిన ఎన్కౌంటర్ తర్వాత బేస్ క్యాంప్ వరకు పోలీసు బృందంతో కలిసి వచ్చిన టెకాల్గూడెమ్కు చెందిన సుక్కా కుంజం (మీడియా, సోషల్ మీడియా సందేశాలలో ప్రస్తావించబడిన పేరు) అతను సురక్షితంగా తిరిగి గ్రామానికి వెళ్లాడని ఆయన ధృవీకరించారు. ఈ విషయంలో మరింత సమాచారం సేకరించిన తరువాత మరిన్ని వివరాలు తెలుపబడునని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ జేపీ ఓ ప్రకటనలో తెలిపారు.