Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుజాతనగర్
ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సీఐ గురుస్వామి అన్నారు. శనివారం కరోనాపై స్థానిక బస్టాండ్ సెంటర్ నందు అవగాహనా సదస్సు నిర్వహించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.
టేకులపల్లి : కోయగూడెం ఓసీ నందు డ్రైవర్లు, క్లీనర్లకు సీఐ భానోత్ రాజు, బోడు ఎస్ఐ రవీందర్, కోయగూడెం ఓసీ ప్రాజెక్ట్ అధికారి మల్లయ్య ఆధ్వర్యంలో కోవిడ్‌కి సంబంధించి అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు.
పాల్వంచ : ప్రపంచం యావత్తు కరోనా సెకండ్ వేవ్ స్పీడుగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన కోవిడ్ టీకా వేయించుకున్నారు. టీకా వేయించుకున్న వారిలో కొత్వాలతో పాటు సొసైటీ వైస్ చైర్మెన్ కాంపెల్లి కనకేష్, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, మల్లెల శ్రీరామమూర్తి, నాయకులు సంతోష్ గౌడ్, నాగరాజు, రాము, హర్షవర్ధన్, రవికుమార్‌లు ఉన్నారు.
అశ్వారావుపేట : మండలంలోని పెద్ద పంచాయతీలు అయిన అశ్వారావుపేట, పేరాయిగూడెం ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు, కార్మికులు కరోనా నిర్మూలనలో మేము సైతం అంటూ కోవిడ్-19 నివారణకు ఇచ్చే వ్యాక్సిన్‌ను శనివారం సర్పంచ్ అట్టం రమ్య, ఈఓ హరిక్రిష్ణతో సహా పాలకవర్గ సభ్యులు మూకుమ్మడిగా ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి టీకా వేయించుకున్నారు. ఇదే క్రమంలో పేరాయిగూడెం పంచాయతీ కార్మికులతో పాటు పంచాయతీ కార్యదర్శి శ్రీరామ మూర్తి వ్యాక్సిన్ పొందారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ఉప సర్పంచ్ కేదార్నాథ్, సభ్యులు యు.ఎస్ ప్రకాష్, పంచాయతీ కార్మికులు కట్టా శ్రీనివాస రావు, కామేశ్వరరావు, అప్పన్న, నందు, నరేంద్ర, మురళి, తదితరులు ఉన్నారు.
అన్నపురెడ్డిపల్లి : కరోన మహమ్మారి విజృంభిస్తున్న నేపధ్యంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మాస్క్ ధరించాలని సబ్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు ఆధ్వర్యంలో యర్రగుంట గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 45 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకా వేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.