Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాఠశాలల మూత, ఆన్లైన్ క్లాసుల పేరుతో చెట్లూ...
పుట్టల వెంట సిగల్ కోసం విద్యార్థుల వెతుకులాట
- రోడ్డున పడ్డ ప్రయివేట్ ఉపాధ్యాయులు
నవతెలంగాణ-గుండాల
కరోనా మహమ్మారి ఎలా వచ్చిందో! ఎందుకొచ్చిందో గానీ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం అంటూ జనాన్ని భయాందోళనకు గురిచేస్తోంది. పెండ్లిండ్లు, ఫంక్షన్లు, జాతరలు ఏదైతేనేం ప్రజలు గుమిగూడి గుంపులుగా ఉంటే వదిలి పెట్టే ప్రసక్తే లేదని హెచ్చరిస్తుంది. సరదాలు, సంతోషాలు అంటూ అజాగ్రత్తగా ఉంటే అస్సలు ఊరుకోనని ప్రపంచ ప్రజానికాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు ఉండడం కాదు కోవిడ్-19 నిబంధనలు అతిక్రమిస్తే ప్రాణాలు పోతాయని యావత్ ప్రపంచానికి చెమటలు పట్టిస్తుంది. విద్యా సంస్థలను మూయించి విద్యార్థులను విద్యకు దూరం చేసి, ప్రయివేట్ ఉపాధ్యాయులను రోడ్డున పడేసి, కూలీలను పనులకు దూరం చేసి, ప్రయాణాలకు ప్రజలను దూరం చేసి పట్టణ ప్రాంతాలను నిర్మానుష్యంగా మార్చి మొత్తానికి కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. 2020 మార్చి నుండి లాక్ డౌన్లు, బ్రేక్ డౌన్లు అంటూ జనజీవనాన్ని చిన్నాబిన్నం చేసి చిందులేస్తుంది. 2020 మార్చి 23న లాక్ డౌన్ పేరుతో మూత పడిన స్కూళ్లు, కాలేజీలు 2021 ఫిబ్రవరి 1న పునఃప్రారంభం అయ్యాయి. అప్పటి వరకు ఆన్లైన్ క్లాసుల పేరుతో ఉక్కిరిబిక్కిరి అయిన విద్యార్థులు, ఇల్లు గడవక ఇబ్బందులు పడ్డ ప్రయివేట్ ఉపాధ్యాయులు, ఇద్దరుముగ్గురు పిల్లలుండి ఒకటే మొబైల్ కలిగి సిగల్ కోసం చెట్లూ, గట్లూ, పుట్టల వెంట తిరుగుతూ నరకయాతన అనుభవిస్తున్న విద్యార్థి, విద్యార్థినీల తల్లిదండ్రులు హమ్మయ్య ఇక ఏమీ కాదు మా పిల్లల కష్టాలు తీరాయని విద్యార్థుల తల్లిదండ్రులు, మా బతుకులు సజావుగా సాగుతాయనుకున్న ప్రయివేట్ ఉపాద్యాయుల ఆశలపై మల్లీ లాక్ డౌన్ పేరుతో మార్చి 24న స్కూళ్లు మూత పడేసి కష్టాలను మరింత రెట్టింపు చేసింది కరోనా మహమ్మారి. దీంతో ఒక ఇంట్లో ఇద్దరుముగ్గురు పిల్లలుండి, ఒక్కొక్కరు ఒక్కో తరగతి చదువుతూ అందరికీ కలిపి ఒకేఒక్క స్మార్ట్ ఫోన్ కలిగి ఉండి పల్లెల్లో సిగల్ అందక చెట్ల వెంట, గట్ల వెంటా, పుట్టల వెంట తిరుగుతూ అష్టకష్టాలు పడుతుంటే ప్రయివేట్ ఉపాధ్యాయులు మాత్రం ఇల్లు గడవక కూలీ పనులు చేస్తూ కడుపు నింపుకుంటున్నారు. కొందరైతే పాఠాలు చెప్పడం తప్పితే మిగతా పనులు అలవాటు లేక, ఒకవేళ చేద్దామన్న కూలీ పనులు దొరకక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కనీసం ప్రయివేటు టీచర్ల ఆకలి తీర్చాలనే ఆలోచనతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లీ స్కూళ్లు తెరిచేంత వరకు ప్రయివేట్ ఉపాధ్యాయులకు ప్రతినెలా రూ.2 వేల ఆర్థిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యం అందజేస్తున్నట్టు ప్రకటించడంతో రాష్ట్రంలోని 1 లక్షా నలభై ఐదు వేల మంది ఉపాధ్యాయుల కళ్లల్లో కొంచెం ఆనందం కనిపిపించింది. అయినప్పటికీ రూ.2 వేల ఆర్థిక సాయం, 25 కేజీల బియ్యంతో ఇల్లు గడవడం కష్టమే అని అనుకుంటున్నారు. ఉన్నట్టుండి ఎమ్మెల్సీ ఎన్నికల ముందు స్కూళ్లు తెరిచి ఎన్నికల అనంతపురం మల్లీ స్కూళ్లు మూతపడడం వెనుక ఆంతర్యం ఏంటో అంటూ రకరకాలుగా చర్చించుకుంటున్నారు. గెలుపుకోసం ఉద్యోగులకు పీఆర్పీ ప్రకటించి సంబురాలు చేసుకునేలా చేసి, ప్రయివేట్ టీచర్లను మాత్రం రోడ్డున పడేశారంటూ ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 1న స్కూళ్లు తెరవగానే అదును కోసం వేచి చూసిన ప్రయివేటు యాజమాన్యాలు మూడు నెలల పేరుతో ఒక విద్యా సంవత్సరానికి అయ్యే మొత్తం ఫీజులను వసూలు చేశాయని, మార్చి 24న మల్లీ మూతపడడం అప్పటికే కట్టిన మొత్తం ఫీజుల సంగతేంటని యాజమాన్యాలను అడిగితే స్కూళ్ల మూత తాత్కాలికమే అని చెప్పడం, ఇంటి దగ్గర ఉన్న పిల్లలు ఒకేఒక మొబైల్‌తో నేనంటే నేను అని ఆన్లైన్ క్లాసులు వినడం, అన్నీ క్లాసులు వినలేకపోతున్నామని కొట్టుకోవడం ఇలాంటి కష్టాలు ఇంకా ఎన్నాళ్ళు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి స్కూళ్లు, కాలేజీలను తెరిచి పూర్తి స్థాయిలో విద్యార్థులకు విద్యను అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.