Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముదిగొండ: మండల పరిధిలో వల్లభి గ్రామంలో ఎస్సై తాండ్ర నరేష్ ఆధ్వర్యంలో శనివారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులపై డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. నలుగురుపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు. వల్లభి గ్రామంలో కరోనా వైరస్‌పై వాహనదారులకు ఎస్సై నరేష్ అవగాహన కల్పించారు. మాస్కు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ కరోనాను నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.