Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల పరిషత్ కో ఆప్షన్ పదవికి ఇమామ్ వలీ రాజీనామా
నవతెలంగాణ- బోనకల్
మండల ప్రజా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇమామ్ వలీ తన కో ఆప్షన్ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. ఈ మేరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గొట్టిపాటి శ్రీదేవికి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా షేక్ ఇమామ్ వలీ మాట్లాడుతూ... తనకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చిందని తెలిపారు స్థానిక గ్రామ పంచాయతీ ఉద్యోగం వచ్చినందువల్ల మండల పరిషత్ కోఆప్షన్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనకు మండల కో ఆప్షన్ పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ పార్టీల కూటమికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ కాలంలో అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు. స్థానిక మండల పరిషత్ కోఆప్షన్ పదవి కోసం ప్రత్యేకంగా కృషి చేసిన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపారు .మండలంలో సహకరించిన సర్పంచులు ఎంపీటీసీలు ప్రభుత్వ అధికారులు, పత్రికా విలేఖరులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్, జెడ్పీటీసీ మోదుగు సుధీర్ బాబు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం తదితరులు పాల్గోన్నారు.