Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సత్తుపల్లి
కరోనా విజృంభిస్తున్న నేపధ్యంలో పట్టణంలో ప్రతీ ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని లేనిపక్షంలో జరిమానా విధించడం జరుగుతుందని సత్తుపల్లి పట్టణ సీఐ రమాకాంత్ హెచ్చరించారు. శనివారం స్థానిక బస్టాండ్‌లో మాస్క్ ధరించనివారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఇక అందరూ మాస్క్ ధరించే ఉండాలన్నారు. షాపింగ్ మాల్స్, ధియేటర్స్‌లో శానిటైజర్లను తప్పనిసరిగా వాడాలన్నారు. సత్తుపల్లి బస్టాండ్‌లో డిపో మేనేజర్ శ్రీహర్ష సహకారంతో బస్సుల వద్ద నోమాస్క్, నోఎంట్రీ బోర్డులను ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.