Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రైవేటు టీచర్ల ఫోరం పాలేరు డివిజన్ అధ్యక్షుడు సాగర్
నవతెలంగాణ నేలకొండపల్లి
తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం పాలేరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్థానిక పొట్టి శ్రీరాములు సెంటర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కరోనా నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు మూతపడి ఉపాధ్యాయులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా వారికి నెలకు రెండు వేల రూపాయలు, 25 కేజీల బియ్యం అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ప్రైవేటు టీచర్ల ఫోరం పాలేరు డివిజన్ అధ్యక్షులు సాగర్ మాట్లాడుతూ కష్టకాలంలో ఉన్న ప్రైవేటు ఉపాధ్యాయులను, సిబ్బంది ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి కొంత ఆర్థిక సహాయం ప్రకటించడం ఊరట కలిగించిందన్నారు. ఇది కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోదని కనీసం ఆరు వేల రూపాయలు చెల్లిస్తేనే కొంతవరకు న్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రైవేటు ఉపాధ్యాయునికి అన్యాయం జరక్కుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కెసిఆర్ అందించే ఆర్థిక సహాయం పంపిణీ జరిగేలా చూడాలన్నారు. కుటుంబ పోషణ ఆర్థిక భారంతో నాగార్జునసాగర్‌లో ఆత్మహత్య చేసుకున్న ప్రైవేట్ ఉపాధ్యాయుడు రవికుమార్ అక్కమ్మ దంపతుల కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రవికుమార్ అక్కమ్మ దంపతులకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. కార్యక్రమంలో ప్రైవేట్ టీచర్ల ఫోరం మండల కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు పుల్లయ్య, వెంకట్, రామకృష్ణ, నరసింహారావు, రమేష్, బాలాజీ, రామారావు, రత్తయ్య, జానీ, అంజయ్య, అయోధ్యరామయ్య, లక్ష్మీ, రేణుక, రాజ్యలక్ష్మి, మమత తదితరులు పాల్గొన్నారు.