Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నవతెలంగాణ-సత్తుపల్లి
మానవతా విలువలు గల వ్యక్తులు భౌతికంగా దూరమైనా వారి ఖ్యాతి శాశ్వతంగా మిగులుతుందని ఆ విధంగా వ్యాసభట్టు రాంకిరణ్ ధన్యజీవి అని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం సత్తుపల్లిలో ఏర్పాటు చేసిన రాంకిరణ్ సంతాప సభ కార్యక్రమంలో ఆయన పాల్గొని చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రంరాజు బెహరా, సత్తుపల్లి బీజేపీ నాయకులు కూసంపూడి రవీంద్ర, ఉడతనేని అప్పారావు, వీరంరాజు, నాయుడు రాఘవరావు, సుదర్శన్ మిశ్రా, పాలకొల్లు శ్రీను, నాగస్వామి తదితర నాయకులు మాట్లాడుతూ రాంకిరణ్తో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకున్నారు. సత్తుపల్లి వాసి అయిన రాంకిరణ్ బీజేపీ పార్టీలో జాతీయ స్థాయికి ఎదిగిన తీరును వివరిస్తూ పిన్న వయస్సులో రాంకిరణ్ మృతి తీరనిలోటని అన్నారు. మధుసూధనరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేష్, జెడ్పీటీసీ కూసంపూడి రామారావు, గాదె సత్యం, దొడ్డా శంకర్రావు, కౌన్సిలర్ అద్దంకి అనిల్, గురుజ్యోతి వ్యవస్థాపక అధ్యక్షులు చిత్తలూరి ప్రసాద్, మోహన్, చందు, సీతారావమ్మ, ప్రముఖ గాయని బేగం తదితరులు పాల్గొన్నారు.