Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మధిర
కుటుంబ సభ్యుడిగా మీ కష్టసుఖాల్లో పాలుపంచు కుంటానని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మధిర మునిసిపాలిటీతో పాటు దెందుకూరులో శనివారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. మునిసిపాలిటీలోని 13వ వార్డులో ఇటీవల మృతి చెందిన గోకర్ల చంద్రం కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రం చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఇటీవల మృతి చెందిన మునిసిపాలిటీ రిటైర్డ్ ఉద్యోగిని వేమవరల సహౌదరి కుటుంబాన్ని పరామర్శించారు. సహౌదరి చిత్రపటానికి నివాళ్లు అర్పించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. తండ్రి మరణంతో బాధపడుతన్న దెందుకూరులో అయితం వెంకటేశ్వరరావును మాజీ ఎంపీ పొంగులేటి పరామర్శించి మనోధైర్యం కల్పించారు. మాజీ ఎంపీ పొంగులేటి వెంట డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు యన్నం కోటేశ్వరరావు, కోట రాంబాబు, మొండితోక సుధాకర్, దొండపాటి వెంకటేశ్వర్లు, సొసైటీ చైర్మన్ కటికల సీతారాంరెడ్డి, ఎరుగు నాగరాజు, అక్కినేపల్లి నాగేశ్వర్రావు, చిలుక సత్యనా రాయణ, సాయితో పాటు కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, మిట్టపల్లి నాగి, బుజ్జి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
శీనన్నగా అండగా ఉంటా
వైరా : ప్రతి కుటుంబానికి శీనన్నగా అండగా ఉంటానని ఖమ్మం మాజీ ఎంపీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని ఖానాపురంలో ఇటీవల మృతి చెందిన శీలం వెంకటరామిరెడ్డి కుటుంబాన్ని శనివారం పొంగులేటి పరామర్శించారు. శీలం వెంకటరామిరెడ్డి చిత్రపటం వద్ద పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. మృతి చెందిన మడిపల్లి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. గోవిందాపురంలో గుండెపోటుతో మృతి చెందిన రామాల లక్ష్మయ్య మృతదేహంపై పూలమాల వేసి నివాళ్లు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. దాచాపురంలో ఇటీవల మృతి చెందిన సామల పుల్లారెడ్డి, కర్నాటి లింగారెడ్డి, వేల్పుల సుధీర్ కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సాయం అందించారు. మాజీ ఎంపీ పొంగులేటి వెంట రాష్ట్ర మార్కెఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మచ్చ బుజ్జి, వైరా పట్టణ అధ్యక్షులు దార్న రాజశేఖర్, మిట్టపల్లి నాగి, పోలా శ్రీనివాసరావు, యువజన విభాగం నాయకులు చల్లా సతీష్, జివ్వాజి నాగరాజు, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు ఎస్కే లాల్ అహ్మద్, శ్రీనివాస్‌రెడ్డి, గోవిందాపురం బుద్ద సురేష్, గన్నవరం సర్పంచ్వేమిరెడ్డి విజయలక్ష్మీ, వేమిరెడ్డి కోటిరెడ్డి, సామల భాస్కర్‌రెడ్డి, దాచాపురం ఉపసర్పంచ్ వేమిరెడ్డి రామశేషారెడ్డి, గరికపాడు సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.