Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మంప్రతినిధి
జాతీయ రహదారుల రాకతో రాష్ట్రంలో మరింత అభివృద్ధికి అవకాశం లభించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రానికి మంజూరైన జాతీయ రహదా రులకు సంఖ్యను కేటాయిస్తూ కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. మహబూబ్‌నగర్ - కొడంగల్ - తాండూరుల మీదుగా కర్ణాటకలోని చించోరి వద్ద ఎన్‌హెచ్ 65ను అను సంధానిస్తూ ఈ రహదారిని ఎన్‌హెచ్ 167-ఎన్గా మార్చారు. అలాగే కొత్తగూడెం- ఇల్లెందు - మహబూబాబాబాద్- నెల్లికుదురు- తొర్రూరు- వలిగొండల మీదుగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలోని గౌరెల్లి జంక్షన్‌కు అనుసంధానిస్తూ ఎన్‌హెచ్ 930 - పిగా గుర్తిస్తూ కేంద్ర జాతీయ రహదారులు,రవాణా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఖమ్మం ఎంపీ నామ పేర్కొన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ పలుమార్లు ఎంపీ నామతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని స్వయంగా కలిసి, లేఖలు అందజేయడం జరిగింది. తాజాగా ఎంపీ నామ నేతృత్వంలో టిఆర్ఎస్ ఎంపీల బృందం కూడా గడ్కరీని కలిసి, వినతిపత్రం అందజేసింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలోని రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించాలని కేంద్రాన్ని కోరడం జరిగింది. హైదరాబాద్‌లోని గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్ జంక్షన నుంచి వలిగొండ, తొర్రూర్, నెల్లికుదురు, మహబూబాబాద్, ఇల్లెందు, కొత్తగూడెంలోని ఎన్‌హెచ్-30 మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించి, నిర్మించాలని గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరినట్లు నామ పేర్కొన్నారు. అలాగే మెదక్, ఎల్లారెడ్డి రుద్రూర్ మార్గాన్ని కూడా జాతీయ రహదారిగా గుర్తించాలని కోరిన సంగతిని నామ గుర్తు చేశారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ గురించి పోరాడి సాధించామన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కేంద్రంపై వత్తిడి తీసుకురావడం వల్ల తాజాగా కేంద్రం రహదారులకు గుర్తింపు సంఖ్యను కేటాయిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిందని నామ పేర్కొన్నారు.
హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్ భూసేకరణకు సంబంధించి సవివరణ ప్రాజెక్టు నివేదిక
(డీపీఆర్) తయారీ కోసం కన్సల్టెంట్‌ను నియమిం చేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. 158 కిలోమీటర్ల ఉత్తర భాగానికి సంబంధించి డీపీఆర్ రూపొందించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారని ఎంపీ నామ చెప్పారు. నూతనంగా మంజూరైన ఎన్‌హెచ్ 930-పి రహదారితో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. కొత్త జిల్లాలను కలుపుతూ ఈ జాతీయ రహదారి హైదరాబాద్‌కు అనుసంధానంగా ఉంటుందని వివరించారు. ఈ రహదారి వల్ల దూరం తగ్గి, సమయం కూడా ఆదా అవుతుందని తెలిపారు. దీని నిర్మాణంతో సరుకు రవాణా కష్టాలు కూడా తీరుతాయని చెప్పారు. కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట నియోజకవర్గాలకు చెందిన ప్రజలు ఇక సులభంగా హైదరాబాద్ చేరుకోవచ్చని నామ పేర్కొన్నారు.