Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహనీయుల ఆశయాల సాధనకై కెవిపిఎస్ బైక్ ర్యాలీ
నవతెలంగాణ-ఖమ్మం
మతోన్మాదుల నుండి భారత రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను, ప్రభుత్వ రంగ సంస్థలను రక్షించుకునేందుకు ఐక్య ఉద్యమాలను చేపట్టాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపునిచ్చారు. శనివారం కెవిపిఎస్ నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక రేవతి సెంటర్ లోని బాబూ జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హల్ ముందు పూలే అంబేద్కర్ సందేశ్ బైక్ ర్యాలీని మనోహర్ ప్రారంభించారు. అనంతరం గంట భీమయ్య అధ్యక్షతన జరిగిన సభలో వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా ప్రైవేట్ పరం చేస్తూ రిజర్వేషన్లు లేకుండా కుట్రలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకోవాలని, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని, అంబేద్కర్ అంటే కొందరి వాడు కాదు, అందరివాడు అని ప్రతి ఒక్కరూ గుర్తుంచు కోవాలని కోరారు. ఈనెల 12న ఖమ్మంలో జరిగే నీలి దండు కవాతును జయప్రదం చేయాలని కోరారు. సమావేశం అనంతరం కెవిపిఎస్ 43వ డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కెవిపిఎస్ నగర నాయకులు వీరభద్రం, బుర్రి వెంకటకుమార్, సిహెచ్. నర్సయ్య, రమేష్, మంగయ్య, ఉదరు కిరణ్, మదన్, మింట్, గోపినాద్, మహర్షి తదితరులు పాల్గొన్నారు.