Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ-కొత్తగూడెం
ఆదర్శ కమ్యూనిస్టు, ప్రజానాయకుడు మహ్మద్ రజబ్ అలీ అని ఆయన సిద్ధాంతాలను సాధించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో శనివారం తెలంగాణ సాయుధ పోరాట యోధులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభ సీపీఐ పక్ష మాజీ ఉపనాయకుడు, సుజాతనగర్ మాజీ ఎమ్మెల్యే మహ్మద్ రజబ్ అలీ 25వ వర్ధంతిని నిర్వహించారు. తొలుత రజబ్ అలి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలులర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యులు నర్సయ్య, వై.శ్రీనివాసరెడ్డి, జిల్లా సమితి సభ్యులు శేషయ్య, కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
జూలూరుపాడు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, ఉమ్మడి ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు పార్టీ నిర్మాత, మాజీ శాసనసభ్యులు కామ్రేడ్ రజబ్ అలీ 25వ వర్ధంతి సీపీిఐ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, నాయకులు మధు, చింత స్వరాజ్ రావు, వీరభద్ర, వీరయ్య, షేక్ నాగుల్ మీరా పాల్గొన్నారు.
రఘునాధపాలెం తుది శ్వాస వరకు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన రజబ్ అలీ పేదల పక్షపాతి అని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ తెలిపారు. సిపిఐ మాజీ శాసనసభ్యులు, తెలంగాణ సాయుధ పోరాటాల యోధులు మహమ్మద్ రజబ్ అలీ 25వ వర్ధంతి వేడుకలను ఆయన స్వగ్రామం పాపట పల్లిలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు, మహమ్మద్ మౌలానా, ఎస్కే జానీ మియా, రజబ్ అలీ కుటుంబ సభ్యులు, ప్రొద్దుటూరు వెంకటరెడ్డి, స్థానిక నాయకులు ,పాల్గొన్నారు.