Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గుర్తింపు సంఘం ఎన్నికల సమావేశంలో ఎమ్మెల్యే రేగా
నవతెలంగాణ-సారపాక
పారిశ్రామిక ప్రాంతమైన సారపాకలోని ఐటీసీలో మే 3న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ యూనియన్ గెలవడం ఖాయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం సారపాకలోని వాసవీ ఫంక్షన్ హాల్లో ఐటీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి యూనియన్ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ.. ఐటీసీలో ఈసారి గులాబీ జెండా ఎగరాల్సిందేనని, ఐటీసీలో పనిచేసే కార్మికులు ఈసారి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఆలోచించి భవిష్యత్ కోసం అభివృద్ధిని చూసి ఓటేయాలన్నారు.
ఆనుబంధ యూనియన్‌గా ఉన్న శ్రామికశక్తికి టీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పొడియం ముత్యాలమ్మ, జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, సొసైటీ చైర్మెన్ బిక్కసాని శ్రీనివాసరావు, టీఆర్ఎస్ మండల ఆధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, శ్రామికశక్తి ఎంప్లాయీస్, బదిలీస్ యూనియన్ ఆధ్యక్షులు శంకర్ రెడ్డి, అంతయ్య, గోపాల్, సత్యనారాయణ పాల్గొన్నారు.