Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అర్హులైన ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు
- ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
గిరిజన పోడు సాగుదారులు అధైర్య పడాల్సిన పని లేదని అర్హులైన ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం హక్కు పత్రాలు అందజేసేలా అన్ని చర్యలు తీసుకుంటు ందని పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పోడు రైతులకు భరోసా కల్పించారు. పోడు సాగుదారులకు, ఫారెస్ట్ అధికారులకు మధ్య వివాదాస్పదంగా మారిన ఛత్తీస్ఘడ్ రాష్ట్ర సరిహద్దు మారుమూల గిరిజన గ్రామమైన తోగ్గుడెం పోడు భూములను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అటవీ శాఖ అధికారి రంజిత్ నాయక్తో ఫోన్లో మాట్లాడారు. రేంజి అధికారి కనక రత్నంతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల కోసం స్టేటస్ కో అనే చట్టాన్ని తీసుకు వచ్చిందని దాని విధి విధానాలు తయారు అయ్యేంతవరకు ఎవ్వరూ పోడు భూములు జోలికి వెళ్లవద్దని సూచించారు. ఆయన వెంట టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు, ఎంపీపీ రేసు లక్ష్మి, జడ్పీటసీ తెల్లం సీతమ్మ, సర్పంచులు పాయం మంగమ్మ, సోడి జ్యోతి, సుమిత్ర, లక్ష్మి, ఎంపీటీసీ భీమరాజు, మడకం రామారావు తదితరులు పాల్గొన్నారు.