Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులపై ఉన్నటువంటి వ్యతిరేక పద్ధతి మార్చుకోవాలని, పెరిగిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని టీడీపీ మహబూబా బాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి, గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, మామకన్ను సర్పంచ్ కొడెం ముత్యమాచారి ఎన్డీ జిల్లా నాయకులు ఈసం శంకర్ డిమాండ్ చేశారు. ఈ విషయమై శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఒకపక్క రైతులు ఆందోళనలు చేస్తుంటే మరోపక్క ఎరువుల కంపెనీలు భారీగా ఎరువుల ధరలు పెంచడం మూలిగే నక్కపై తాట ిపండు పడ్డ చందంగా ఉందన్నారు. సంక్షోభంలో ఉన్న రైతులపై ఎరువుల ధరలు పిడుగులా వచ్చి పడ్డాయని ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎరువులు, విత్తనాల ధరలను తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఈసం పాపారావు, సాయనపల్లి ఎంపీటీసీ కల్తి కృష్ణారావు, ఎన్డీ డివిజన్ వి.అజరు, మండల నాయకులు బి.వెంకన్న, ఈసం కృష్ణ, జి.రామచం దర్, ఎస్.కుమార్, డాక్టర్ గణేష్, కోడూరి జగన్, సనప కృష్ణ, కో ఆప్షన్ సభ్యులు జావిద్ పాషా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్తయ్య, ఈసం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
అశ్వారావుపేట : ఎన్డీ, ఏఐకేఎంఎస్ మండల కమిటీల ఆధ్వర్యంలో పెరిగిన ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం తహశీల్దార్ చల్లా ప్రసాద్‌కు మెమోరాండం సమర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘాల మండల నాయకులు దర్ముల శ్రీరాములు, కారం మల్లేశు, 'కారం రాజులు, కె.అర్జన్, కె.ప్రసాధు, కే.రాజుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
దమ్మపేట : కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని మండలంలోని గండుగుల పల్లి గ్రామంలో శనివారం కేంద్ర ప్రభుత్వ దిష్ట్టి బొమ్మ ను అఖిల భారత రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యు ల అమర్లపూడి రాము మాట్లాడుతూ... కేంద్ర ప్రభు త్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయా లని, రైతులు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.